ఈ బాలిక పవర్ మామూలుగా లేదుగా..! నెటిజన్లు దిమ్మెరపోయేలా చేస్తున్న Viral Video

ABN , First Publish Date - 2022-01-10T03:17:43+05:30 IST

ఓ చెట్టును కూలదోయాలంటే పలుగు లేదా రంపం కావాలి. అది కూడా బలిస్టులైన వారితోనే పూర్తయ్యే పని ఇది! కానీ ఓ చిన్నారి పిడిగుద్దుల ముందు ఓ చెట్టు నిలవలేకపోయిందంటే నమ్మగలమా..? అది అసంభవమని అనిపించదూ..! కాని..

ఈ బాలిక పవర్ మామూలుగా లేదుగా..! నెటిజన్లు దిమ్మెరపోయేలా చేస్తున్న Viral Video

ఇంటర్నెట్ డెస్క్:  ఓ చెట్టును కూలదోయాలంటే పలుగు లేదా రంపం కావాలి. అది కూడా బలిష్టులైన వారితోనే పూర్తయ్యే పని ఇది! కానీ ఓ చిన్నారి పిడిగుద్దుల ముందు ఓ చెట్టు నిలవలేకపోయిందంటే నమ్మగలమా..? అది అసంభవమని అనిపించదూ..!  కానీ.. ఈ ఘటన నిజంగానే జరిగింది. రష్యాకు చెందిన ఎవ్నికా సావకాస్..ముష్టిఘాతాలకు చెట్టు బదబదాలైపోయింది. 


అయితే.. బాక్సింగ్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ఎవ్నికాకు ఇటువంటి నమ్మశక్యం కాని ఫీట్లు చేయడం  కొత్తేమీ కాదు. గతంలో.. అంటే ఆమెకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే ఒక్క నిమిషంలో వంద పంచ్‌లు విసిరి అందరి దృష్టినీ ఆకర్షించింది. తన తండ్రి దగ్గరే ఆమె శిక్షణ పొందుతోంది. ప్రొఫెషనల్‌ బాక్సర్ కావాలన్నది ఆమె ఆశయం. ఇందుకోసం ఆమె మూడేళ్ల వయసున్నప్పటి నుంచే శిక్షణ ప్రారంభించిందట. బాక్సింగ్‌లో శిక్షణ కోసం అందరూ పంచింగ్ బ్యాగులు వాడితే ఎవ్నికా మాత్రం చెట్లపైనే పంచ్‌లు విసురుతూ ప్రాక్టీసు చేస్తుంటుంది. ఇప్పటికే ఆమె..ప్రపంచంలోనే శక్తివంతమైన బాలికగా పాపులర్ అయ్యింది. ఇక ఎవ్నికా పవర్‌ను కళ్లకు కట్టినట్టు చూపించే తాజా వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన వారెవరైనా సరే షాకైపోకుండా ఉండలేరు!



Updated Date - 2022-01-10T03:17:43+05:30 IST