Shocking: కాలేజీ ప్రిన్సిపాల్‌పై కాల్పులు జరిపిన విద్యార్థి.. కారణం ఏంటో తెలిస్తే షాక్..!

ABN , First Publish Date - 2022-09-24T21:04:25+05:30 IST

ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ రోజు (శనివారం) ఉదయం నేరుగా ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లాడు.

Shocking: కాలేజీ ప్రిన్సిపాల్‌పై కాల్పులు జరిపిన విద్యార్థి.. కారణం ఏంటో తెలిస్తే షాక్..!

ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ రోజు (శనివారం) ఉదయం నేరుగా ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్లాడు.. ఆయనకు `గుడ్ మార్నింగ్` చెప్పాడు.. అనంతరం బ్యాగ్‌లో నుంచి తుపాకీ తీసి ప్రిన్సిపాల్‌కు గురిపెట్టాడు.. భయంతో ప్రిన్సిపాల్ పారిపోయేందుకు ప్రయత్నించాడు.. ఈ లోపు ఆ విద్యార్థి కాల్పులు ప్రారంభించాడు.. మూడు బుల్లెట్లు ప్రిన్సిపాల్ శరీరంలోకి దూసుకుపోయాయి.. ప్రస్తుతం ఆ ప్రిన్సిపాల్ పరిస్థితి విషమంగా ఉంది.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని సీతాపూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

షాకింగ్ ఘటన.. అంత్యక్రియలు చేసిన 3 నెలల తర్వాత సమాధిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీసి..


ఆదర్శ్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్ రామ్ స్వరూప్ వర్మ శనివారం ఉదయం 8.30 గంటలకు తన గదిలో కూర్చుని పని చేసుకుంటున్నారు. ఆ సమయంలో విద్యార్థి గుర్వీందర్ సింగ్ అక్కడకు వెళ్లాడు. గుర్వీందర్ మొదట ప్రిన్సిపాల్‌ని విష్ చేశాడు. ఆ తర్వాత వెంటనే బ్యాగ్‌లో నుంచి పిస్టల్‌ను బయటకు తీశాడు. షాకైన ప్రిన్సిపాల్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో గుర్వీందర్ అతనిపై కాల్పులు జరిపాడు. ప్రిన్సిపాల్ నడుము వెనుక భాగంలో మూడు బుల్లెట్లు తగిలాయి. శబ్దాలు విన్న టీచర్లు, విద్యార్థులు అక్కడకు చేరుకోవడంతో నిందితుడు పారిపోయాడు. 


శుక్రవారం ఉదయం ప్రాక్టికల్ ఫైల్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో మరో విద్యార్థి రోహిత్‌తో గుర్విందర్‌కు గొడవ జరిగింది. రోహిత్‌తో గొడవ పడుతున్న క్రమంలో గుర్విందర్‌ తరగతి కుర్చీలను విరిచేశాడు. ప్రిన్సిపాల్ రామ్ సింగ్ వర్మకు సమాచారం చేరడంతో అతడు విద్యార్థులిద్దరినీ గదికి పిలిపించి మందలించారు. కుర్చీలు పగలగొట్టిన గుర్వీందర్‌ను కొట్టారు. దీంతో తీవ్ర కోపం పెంచుకున్న గుర్వీందర్.. ప్రిన్సిపాల్‌ హత్యకు పథకం రచించాడు. శనివారం ఉదయం తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న గుర్వీందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, గుర్వీందర్ చేసిన పని తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కూడా ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. 

Updated Date - 2022-09-24T21:04:25+05:30 IST