అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో తాజాగా ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 20,75,546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో 14,477 మరణాలు సంభవించాయి. ఏపీలో 1,758 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,59,313 మంది రికవరీ చెందారు.