వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరుకున్న 12.60 లక్ష‌ల మంది ప్రవాసులు !

ABN , First Publish Date - 2020-09-01T19:43:41+05:30 IST

మహమ్మారి కరోనా వైరస్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం 'వందే భారత్ మిషన్'(వీబీఎం) ద్వారా స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే.

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరుకున్న 12.60 లక్ష‌ల మంది ప్రవాసులు !

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం 'వందే భారత్ మిషన్'(వీబీఎం) ద్వారా స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. మే 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఐదు దశలు పూర్తి చేసుకుంది. వీబీఎం ద్వారా ఆగస్టు 30వ తేదీ వరకు వివిధ దేశాల నుంచి మొత్తం 12,60, 118 మంది ప్రవాసులను స్వదేశానికి తరలించినట్లు భారత పౌర విమానయాన శాఖ సోమవారం వెల్లడించింది. వీరిలో 7,25,500 మంది ప్రవాసులను వివిధ చార్టెడ్ విమాన ద్వారా స్వదేశానికి తరలించగా... 3,95,540 మంది ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల ద్వారా భారతదేశానికి చేరుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది.


అలాగే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆరో విడత 'వందే భారత్ మిషన్' ప్రారంభిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో యధావిధిగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఖతార్, మాల్దీవులు దేశాలతో ఎయిర్ బబుల్ ఏర్పాట్లు కొనసాగుతాయని ఎంఈఏ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.     

Updated Date - 2020-09-01T19:43:41+05:30 IST