Abn logo
Apr 10 2020 @ 00:42AM

కరోనా సేవలకు 123 మంది టీచర్లు

ఒంగోలువిద్య, ఏప్రిల్‌ 9 : కరోనా వైరస్‌ను నిరోధించేందుకు కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ తనిఖీల్లో 123 మంది ఉపా ధ్యాయులను నియమిస్తూ డీఈవో వీఎస్‌.సుబ్బారావు గురువారం ఉత్తర్వు లు జారీ చేశారు. గతంలో ఈ తనిఖీల్లో ఫిజికల్‌డైరెక్టర్లు, పీఈటీలను ని యమించారు.


వీరిలో 50 సంవత్సరాలు పైబడినవారు, మహిళా పీడీలు, పీఈటీలకు మినహాయింపు ఉందని కలెక్టర్‌ వెల్లడించారు. కలెక్టర్‌ ఆదే శాలు మేరకు కొత్తగా 123 మందిని నియమించారు. ప్రస్తుతం స్కూలు అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్సు, బైలాజికల్‌ సైన్సు వారిని నియమిం చారు. తాజాగా నియమితులైన వారందరూ వారికి కేటాయించిన పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. రిపోర్టు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.

Advertisement
Advertisement
Advertisement