ఆదిలాబాద్ టౌన్, జనవరి 22 : జిల్లా వ్యాప్తంగా శనివారం 123 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 2243 మందికి పరీక్షలు నిర్వహించగా 123 మందికి పాజిటివ్ వచ్చింది. మరో 117 మందికి సంబంధించి పెండింగ్‌లో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. 544 మంది అనుమానితులు ఉండగా 535 మంది హోం ఐసోలేషన్‌కు పంపినట్లు తెలిపారు. 2003 మందికి నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు.