జిల్లాలో నూతనంగా 12,180 ిపింఛన్లు

ABN , First Publish Date - 2020-10-01T08:09:23+05:30 IST

జిల్లాలో అక్టోబరు నెలలో నూతనంగా 12,180 పింఛన్లు మంజూరైనట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టరు హరిహరనాథ్‌ వెల్లడించారు.

జిల్లాలో నూతనంగా 12,180 ిపింఛన్లు

వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా 2,644 దుకాణాల ఏర్పాటు

డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్‌


గొల్లప్రోలు, సెప్టెంబరు 30: జిల్లాలో అక్టోబరు నెలలో నూతనంగా 12,180 పింఛన్లు మంజూరైనట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టరు హరిహరనాథ్‌ వెల్లడించారు. వీటితో కలుపుకొని 6లక్షల69వేల822మందికి పింఛన్లను 1న అందజేయనున్నట్లు చెప్పారు. గొల్లప్రోలులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతినెలా అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకూ 2,644 దుకాణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


వైఎస్‌ఆర్‌ బీమా కింద 14.56 లక్షలమంది ప్రయోజనం పొందనుండగా ఇప్పటివరకూ 90శాతం మంది వివరాలను రిజిస్ట్రేషన్‌ చేశామని చెప్పారు. 90వేలమందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో వారితో తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగనన్న తోడు పథకం ద్వారా 62వేల మంది నమోదు చేయించుకున్నారని, వీరికి రూ.10వేలు వంతున వడ్డీ లేని రుణం అందించనున్నామని చెప్పారు.


వైఎస్‌ఆర్‌ రుణమాఫీ పథకం ద్వారా 6.72లక్షల మహిళలకు రూ.628కోట్లు విడుదల కాగా సదరు మొత్తాలను వారి బ్యాంకు ఖాతాలకు జమచేశామన్నారు.


Updated Date - 2020-10-01T08:09:23+05:30 IST