ఈవీల చార్జింగ్‌కు యూనిట్‌కు రూ.12.06

ABN , First Publish Date - 2021-12-04T07:49:36+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే రాయితీలతో నెలకొల్పే ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) చార్జింగ్‌ కేంద్రాల్లో యూనిట్‌కు వసూలు చేసే ధరను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది.

ఈవీల చార్జింగ్‌కు యూనిట్‌కు రూ.12.06

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే రాయితీలతో నెలకొల్పే ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) చార్జింగ్‌ కేంద్రాల్లో యూనిట్‌కు వసూలు చేసే ధరను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రతీ యూనిట్‌కు రూ.12.06 (జీఎస్టీ అదనం) వసూలు చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరాలను బట్టి కేంద్ర ప్రభుత్వం ఒక్కో చార్జింగ్‌ కేంద్రానికి 30-70 శాతం రాయితీ ఇస్తోంది. ఒక్కో చార్జింగ్‌ కేంద్రం ఏర్పాటుకు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల దాకా వ్యయం కానుంది. అయితే ప్రభుత్వ రాయితీతో పెట్టే కేంద్రాల్లో తక్కువ ధరకే చార్జింగ్‌ చే సుకునేలా వెసులుబాటు ఇస్తూ ఈ నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ సంస్థ (రెడ్‌కో) ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 118 కేంద్రాలు, స్మార్ట్‌ సిటీ కార్యక్రమం కింద కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో చెరో 10 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దాంతో ఆయా కేంద్రాల్లో యూనిట్‌ విద్యుత్‌ చార్జింగ్‌కు రూ.12.06 వ సూలు చేస్తారు.

Updated Date - 2021-12-04T07:49:36+05:30 IST