యుకే నుంచి భారత్‌కు చేరిన 1200 ఆక్సిజన్ సిలెండర్లు

ABN , First Publish Date - 2021-05-13T17:32:43+05:30 IST

కోవిడ్ సెకెండ్ వేవ్‌తో దేశం విలవిల్లాడుతోంది. ప్రతిరోజూ 3 నుంచి 4 లక్షల కొత్త కేసులు..

యుకే నుంచి భారత్‌కు చేరిన 1200 ఆక్సిజన్ సిలెండర్లు

న్యూఢిల్లీ: కోవిడ్ సెకెండ్ వేవ్‌తో దేశం విలవిల్లాడుతోంది. ప్రతిరోజూ 3 నుంచి 4 లక్షల కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా కేసుల్లో పెరుగుదలను నిలువరించేందుకు పలు రాష్ట్రాలు తాజా ఆంక్షలతో పాటు రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ పోతున్నాయి. మరోవైపు, 18 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఆక్సిజన్, ఇతర వైద్య సరఫరాల కొరత కూడా తీవ్రంగా ఉండటంతో భారత్‌కు పలు దేశాలు కోవిండ్ ఎయిడ్ పంపుతూ స్నేహహస్తం అందిస్తున్నాయి. కాగా, బ్రిటిష్ అక్సిజన్ కంపెనీ నుంచి (యూకే) మరో 1200 ఆక్సిజన్ సిలెండర్లు భారత్‌కు చేరుకున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారంనాడు ఒక ట్వీట్‌లో తెలిపారు.

Updated Date - 2021-05-13T17:32:43+05:30 IST