ఆ ఇంట్లో 120 విషపూరిత జీవులు.. వాటికి సెపరేట్‌గా బెడ్‌రూమ్ కూడా..

ABN , First Publish Date - 2022-03-09T15:25:23+05:30 IST

కుక్కలు, పిల్లులు, చిలుకలు, పావురాలను..

ఆ ఇంట్లో 120 విషపూరిత జీవులు.. వాటికి సెపరేట్‌గా బెడ్‌రూమ్ కూడా..

కుక్కలు, పిల్లులు, చిలుకలు, పావురాలను ఇళ్లలో పెంచుకోవడాన్ని మీరు చూసేవుంటారు. అయితే సాలెపురుగులను పెంచుకోవడాన్ని మీరెప్పుడూ చూసివుండరు. 34 ఏళ్ల ఆరోన్ ఫీనిక్స్ అనే వ్యక్తి సాలెపురుగులపై చూపించే ప్రేమను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అతను తన ఇంటిలో ఏకంగా 120 సాలెపురుగులకు ఆశ్రయం ఇచ్చాడు. దీంతో స్థానికులు అతనిని రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ అని పిలుస్తుంటారు. ఆరోన్.. ఈ సాలెపురుగులు నిద్రించడానికి ఒక ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశాడు. అవి అక్కడ హాయిగా నిద్రపోతాయి. ఆరోన్‌కు డిప్రెషన్‌తో పాటు మానసిక సమస్య కూడా ఉంది. దీని నుండి బయటపడటానికి బాగా ఇష్టమైన పని చేయాలని వైద్యులు అతనికి సూచించారు.  


దీంతో ఆరోన్ తాను క్రాఫ్ట్ లేదా ఏదైనా చదవడం కంటే విషపూరిత సాలెపురుగులతో కాలక్షేపం చేయడానికి ఇష్టపడతానని వైద్యులకు తెలిపాడు. డాక్టర్ సలహా మేరకు ఆరోన్ తన మానసిక ఆనందం కోసం 120 దక్షిణ అమెరికా సాలెపురుగులను ఇంట్లో పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు తన ఇంట్లో సాలెపురుగులు తిరుగుతున్నాయని, వాటితో కలిసి ఉండటం తనకు మంచి అనుభూతి అందిస్తున్నదని ఆరోన్ పేర్కొన్నాడు. కాగా వైద్యులు.. ఆరోన్ ఫీనిక్స్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని, డిప్రెషన్‌లో కూడా ఉన్నట్లు నిర్ధారించారు. కాగా ఆరోన్ సాలెపురుగులు నిద్రించేందుకు, ఇంట్లో ప్రత్యేక బెడ్ రూమ్ ఏర్పాటు చేశాడు. ఎవరెన్ని చెప్పినా ఇదే తనకు ఇష్టమని తెలిపాడు. ఆరోన్ సాలెపురుగులను గంటల తరబడి తదేకంగా చూస్తాడు. వాటి నుండి  పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతాడు. కాగా ఆరోన్ తన భార్యాపిల్లలతో ఒకే ఇంట్లో ఉంటాడు. మొదట్లో ఇంట్లోనివారంతా సాలెపురుగులంటే భయపడేవాడు. అయితే ఇప్పుడిప్పుడే వాటికి అలవాటు పడ్డాడు.



Updated Date - 2022-03-09T15:25:23+05:30 IST