స్కూలు తెరవలేదని చెట్టు కింద కూర్చున్న బాలుడు.. ఆ చెట్టును ముట్టుకోగానే ఎంత ఘోరం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-12T17:47:47+05:30 IST

ఆ బాలుడు ఎప్పటిలాగానే ఆ రోజు ఉదయం కూడా స్కూలుకు వెళ్లాడు.. అయితే అప్పటికి ఇంకా తలుపులు తెరవలేదు..

స్కూలు తెరవలేదని చెట్టు కింద కూర్చున్న బాలుడు.. ఆ చెట్టును ముట్టుకోగానే ఎంత ఘోరం జరిగిందంటే..

ఆ బాలుడు ఎప్పటిలాగానే ఆ రోజు ఉదయం కూడా స్కూలుకు వెళ్లాడు.. అయితే అప్పటికి ఇంకా తలుపులు తెరవలేదు.. దీంతో సమీపంలోని చెట్టు కింద కూర్చున్నాడు.. ఆడుకుంటూ ఆ చెట్టును ముట్టుకున్నాడు.. అంతే గిలగిలా గింజుకుంటూ అక్కడికక్కడే ప్రాణం వదిలాడు.. ఆ చెట్టుపై నుంచి ఎలాంటి రక్షణా లేకుండా విద్యుత్ వైరు వెళ్తోంది.. ఆ వైరు నుంచి విద్యుత్ చెట్టులోకి ప్రవహించడం వల్ల ఆ బాలుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. 


రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు సమీపంలోని ఇక్లహార గ్రామానికి చెందిన 12 ఏళ్ల అన్షు అనే విద్యార్థి ఆరో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం అతను ఇంటి నుంచి పాఠశాలకు బయల్దేరాడు. అప్పటికి పాఠశాల తలుపులు తెరవకపోవడంతో సమీపంలోని వేప చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు కొమ్మల మధ్య నుంచి 11కేవీ విద్యుత్ వైరు వేశారు. దానికి ప్లాస్టిక్ ట్యూబ్ వేయలేదు. దీంతో ఆ వైరు నుంచి ఆ చెట్టులోకి విద్యుత్ ప్రవహించింది. 


ఆ చెట్టు కింద ఆడుకుంటూ అన్షు దానిని ముట్టుకున్నాడు. దీంతో అతనికి కరెంట్ షాక్ కొట్టింది. చెట్టు కింద అన్షు పడి ఉండడం చూసిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యంపై ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Updated Date - 2022-03-12T17:47:47+05:30 IST