అబార్షన్ చేయించుకుంటాను.. అనుమతించండంటూ కలెక్టర్‌ను కోరిందో యువతి.. ఆమె కథేంటో తెలిసి..

ABN , First Publish Date - 2022-04-22T17:46:30+05:30 IST

ఆ యువతి తన గ్రామానికే చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది.. అతడితో కలిసి తిరిగేది..

అబార్షన్ చేయించుకుంటాను.. అనుమతించండంటూ కలెక్టర్‌ను కోరిందో యువతి.. ఆమె కథేంటో తెలిసి..

ఆ యువతి తన గ్రామానికే చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది.. అతడితో కలిసి తిరిగేది.. ఆ సమయంలో ఆ యువకుడు.. యువతి తనతో క్లోజ్‌గా ఉన్నప్పుడు కొన్ని ఫొటోలు తీశాడు.. కొన్ని రోజుల తర్వాత ఆ యువతి అతడికి బ్రేకప్ చెప్పేసింది.. అయితే ఆ ఫొటోలను చూపించి బెదిరించి ఆ యువతితో అతను శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చింది.. యువకుడిపై అత్యాచారం కేసు పెట్టింది.. తనకు అబార్షన్ చేయించుకునే అవకాశం కల్పించమని జిల్లా కలెక్టర్‌ను వేడుకుంది. 


ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నగరానికి ఆనుకుని ఉన్న ఓ గ్రామంలో నివసిస్తున్న యువతిని బెదిరించి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాము క్లోజ్‌గా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చింది. అనంతరం ఆ యువకుడిపై అత్యాచారం కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


12 నెలల తన గర్భాన్ని తీసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆమె జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బిడ్డకు జన్మనిచ్చేందుకు తాను సిద్ధంగా లేనని, తను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నానని, అందుకు పర్మిషన్ ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఆమె లేఖకు జిల్లా కలెక్టర్ నుంచి ఇంకా సమాధానం రాలేదు. 

Updated Date - 2022-04-22T17:46:30+05:30 IST