జగిత్యాలలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-08-12T06:02:21+05:30 IST

జగిత్యాల పట్టణంలోని భవాని నగర్‌లో ఉన్న బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు గు రువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

జగిత్యాలలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత
అస్వస్థతకు గురైన విద్యార్థులు

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 11: జగిత్యాల పట్టణంలోని భవాని నగర్‌లో ఉన్న బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు గు రువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లోని 8, 9 తరగ తులకు చెందిన రవీణ, దర్శన, శ్రీనిత్య, నవీన, అక్షయ, హర్ష, నవ్య, శివా ని, రితికతో పాటు మరికొంత మంది విద్యార్థులు ఒక్కసారిగా హాస్టల్‌లో కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో హుటాహు టిన హాస్టల్‌ ఉపాధ్యాయులు అస్వస్థతకు గురైన విద్యార్థులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా రన్నింగ్‌ పోటీలకోసం విద్యార్ధులు ప్రాక్టిస్‌ చేస్తున్న క్రమంలో శక్తికి మించి రన్నింగ్‌ చేయడంతో తీవ్ర అ స్వస్థతకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. ఒకే సారి 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో హాస్టల్‌ సిబ్బంది బయ బ్రాంతులకు గురయ్యారు. 

విద్యార్థుల పరిస్థితి మెరుగ్గా ఉండడంతో జిల్లా అధికారు లతో పాటు హాస్టల్‌ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థు లు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ బీ ఎస్‌ లతలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడి గి తెలుసుకుని వారిలో ధైర్యం నింపారు. ప్రతి నెల విధిగా గురుకుల హా స్టళ్లలో విధిగా వైద్య శిబిరాలు నిర్వహించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-08-12T06:02:21+05:30 IST