మహారాష్ట్ర: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన 12 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2020-04-09T01:50:50+05:30 IST

కేంద్రం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తు.. నేవీ ముంబైలో మార్నింగ్‌‌కి వెళ్లిన 12 మందిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పన్వెల్

మహారాష్ట్ర: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన 12 మంది అరెస్ట్

ముంబై: కేంద్రం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తు.. నేవీ ముంబైలో మార్నింగ్‌‌కి వెళ్లిన 12 మందిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పన్వెల్ ప్రాంతంలో వీళ్లు మార్నింగ్‌ వాక్‌కి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. వీరందరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారని.. వీరిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశామని సీనియర్ పోలీస్‌ అధికారి అజయ్ కుమార్ లాండ్గే అన్నారు. 


ఇక ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బుధవారం నుంచి బిగ్‌బజార్, రిలయన్స్ మార్ట్‌లతో పాటు ఇతర పండ్లు, కూరగాయలు, మాంసం విక్రయించే దుకాణాలు కేవలం సాయంత్రం 5 గంటల వరకే తెరిచి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మందుల దుకాణాలు, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ యధావిధిగా పని చేస్తాయని ఆయన పేర్కొన్నారు. సరైన కారణం లేకుండా ఎవరైన ఇంటి బయట కానీ, రోడ్ల మీదకానీ తిరుగుతూ కనిపిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-09T01:50:50+05:30 IST