12 నామినేషన్లు ఆమోదం

ABN , First Publish Date - 2021-02-25T05:26:40+05:30 IST

వచ్చే నెల 14న జరిగే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల సమర్పణ గడువు మంగళవారం ముగిసింది.

12 నామినేషన్లు ఆమోదం
అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలిస్తున్న రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు

ఉపసంహరణకు రేపటి వరకు గడువు 

కాకినాడ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 14న జరిగే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల సమర్పణ గడువు మంగళవారం ముగిసింది. రెండు జిల్లాల నుంచి 12 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని రిటర్నింగ్‌ అధికారి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, సహాయ రిటర్నింగ్‌ అధికారి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు వెల్లడించారు. బుధవారం వారు కలెక్టరేట్‌లో అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించారు. ఉపసంహరణకు శుక్ర వారం వరకు గడువు ఉంది.

అభ్యర్థులు వీరే ...

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుంచి దిద్దే అంబేద్కర్‌, ఏలూరు కండ్రిగగూడెం నుంచి గంటా నాగేశ్వరరావు, ఉండ్రాజవరం మండలం నుంచి చెరుకూరి సుభాష్‌చంద్రబోస్‌, తిర్రే రవి దేవా,తాడేపల్లిగూడెం నుంచి ఎంబీ నాగేశ్వరరావు, ఏలూరు నుంచి షేక్‌ సాబ్జీ బరిలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నుంచి పి.వంశీకృష్ణంరాజు, రాజమహేంద్రవరం నుంచి యడవిల్లి రామకృష్ణ ప్రసాద్‌, పలివెల వీర్రాజు, రాజోలు నుంచి బడుగు సాయిబాబా, రామచంద్రపురం నుంచి గంధం నారాయణరావు, అమలాపురం నుంచి ఇళ్ల సత్యనారాయణ పోటీలో ఉన్నారు. 


Updated Date - 2021-02-25T05:26:40+05:30 IST