Advertisement

Radhe shyam : హైలైట్ కానున్న 12 నిమిషాల ఎపిసోడ్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీసిరీస్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ అలరించబోతున్నారు. ఇంకా మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి, కున్నల్ రాయ్ కపూర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస ఛాయా గ్రహణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అభిమానుల్ని ఊరిస్తోంది. 


రీసెంట్ గా ‘రాధేశ్యామ్’ ఫస్ట్ కాపీ చూసిన ప్రభాస్.. ఫైనల్ ఔట్ పుట్ పై చాలా సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఓ అందమైన లవ్ స్టోరీని దర్శకుడు చాలా క్యూట్ గా తెరకెక్కించాడని తన సన్నిహితుల దగ్గర అభిప్రాయాన్ని తెలిపారట. అంతేకాదు ఈ సినిమాలో 12 నిమిషాల ఎపిసోడ్ సినిమా ఫేట్ నే మార్చుతుందని, ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ఆ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందని చెప్పారట ప్రభాస్. ఈ విషయం తెలియగానే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని ఎప్పుడు చూసేద్దామా అనే ఆత్రుతతో అభిమానులున్నారు. మరి సినిమాలోని ఆ 12 నిమిషాల ఎపిసోడ్ లో ఏముందో తెలియాలంటే.. జనవరి 14 వరకూ ఆగాల్సిందే. 

Advertisement