చెట్టుపై 12 అగుడుల కొండ చిలువ.. బంబేలెత్తిపోయిన జనాలు. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-04T21:54:26+05:30 IST

ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో తిలియదు కానీ ఓ పన్నెండు అడుగుల కొండ చిలువ సరాసరి జనావాసాల్లోకి వచ్చేసింది. 20 అడుగుల పొడవైన చెట్టును గబగబా ఎక్కేసి అక్కడే రెస్ట్ తీసుకుంటుంది. ఈ క్రమంలో అది అక్కడే ఉన్న జనాల దృష్టిలో పడింది. ఒక్కసారిగా 12 అడుగు

చెట్టుపై 12 అగుడుల కొండ చిలువ.. బంబేలెత్తిపోయిన జనాలు. చివరకు ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో తిలియదు కానీ ఓ పన్నెండు అడుగుల కొండ చిలువ సరాసరి జనావాసాల్లోకి వచ్చేసింది. 20 అడుగుల పొడవైన చెట్టును గబగబా ఎక్కేసి అక్కడే రెస్ట్ తీసుకుంటుంది. ఈ క్రమంలో అది అక్కడే ఉన్న జనాల దృష్టిలో పడింది. ఒక్కసారిగా 12 అడుగుల కొండ చిలువను చూసేసరికి గ్రామస్థులు బంబేలెత్తిపోయారు. అనంతరం ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని శివపురి ప్రాంతంలోకి సోమవారం ఉదయం అప్పుడే వేటాడి.. కడుపునింపుకున్న ఓ 12అడుగుల కొండ చిలువ ప్రవేశించింది. 20 అడుగుల చెట్టుపై తీరిగ్గా.. రెస్ట్ తీసుకుంటుండగా అక్కడి జనాల దృష్టిలో పడింది. ఈ క్రమంలో భయాందోళనలకు గురైన ప్రజలు.. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్నేక్ క్యాచర్‌తోపాటు అధికారులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం.. ఓ కర్రకు ఐరన్ హుక్‌ను కట్టి.. దాని సహాయంతో ఆ కొండ చిలువను కిందకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చిర్రెత్తుక్కుపోయిన కొండ చిలువ.. అక్కడున్న ప్రజలను మరింత భయపెట్టింది. అయితే చివరకు అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. కొండ చిలువను చెట్టుపై నుంచి కిందకు లాగి.. బంధించారు. అనంతరం దగ్గర్లో ఉన్న అఢవిలో దాన్ని వదిలిపెట్టారు. కాగా.. ప్రస్తుతం ఆ కొండ చిలువకు సంబంధించిన ఫొటోలు.. వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2021-10-04T21:54:26+05:30 IST