జీవన యోగ్యతలో అ‘భాగ్య నగరం’

ABN , First Publish Date - 2021-06-20T08:50:55+05:30 IST

దేశంలో జీవన పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌కు 11వ స్థానం దక్కింది. ఈ జాబితాలో బెంగళూరు అగ్ర స్థానంలో నిలవగా చెన్నై, సిమ్లా,

జీవన యోగ్యతలో అ‘భాగ్య నగరం’

న్యూఢిల్లీ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో జీవన పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌కు 11వ స్థానం దక్కింది. ఈ జాబితాలో బెంగళూరు అగ్ర స్థానంలో నిలవగా చెన్నై, సిమ్లా, భువనేశ్వర్‌, ముంబై వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ 2021’ నివేదికను సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎ్‌సఈ) విడుదల చేసింది. రాజధానులకు ర్యాంకులను కేటాయించడానికి ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ (బతకడానికి అనువుగా ఉన్న పరిస్థితులు), నాణ్యమైన జీవితం, ఆర్థిక సామర్థ్యం, స్థిరత్వం, పౌరుల అవగాహన అనే పరామితులను సీఎ్‌సఈ తీసుకుంది. 

Updated Date - 2021-06-20T08:50:55+05:30 IST