ఆర్‌జీ-1లో 119శాతం బొగ్గు ఉత్పత్తి

ABN , First Publish Date - 2022-07-01T06:17:14+05:30 IST

జూన్‌ మాసంలో ఆర్‌జీ-1 ఏరియా 119 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించిందని జీఎం కల్వల నారాయణ చెప్పారు.

ఆర్‌జీ-1లో 119శాతం బొగ్గు ఉత్పత్తి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జీఎం

- జీఎం నారాయణ

గోదావరఖని, జూన్‌ 30: జూన్‌ మాసంలో ఆర్‌జీ-1 ఏరియా 119 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించిందని జీఎం కల్వల నారాయణ చెప్పారు. గురువారం జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2.89లక్షల టన్నులకు 3.29లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిందని, జీడీకే 1,3ఇంక్లైన్‌ 19వేల టన్నులకు 16వేల టన్నులు, జీడీకే 2,2ఏ ఇంక్లైన్‌ 22వేల టన్నులకు 21వేల టన్నులు, జీడీకే 11ఇంక్లైన్‌ 73వేల టన్నులకు 69వేల టన్నులు, భూగర్భ గనుల లక్ష్యం 1.16లక్షల టన్నులకు 1.07లక్షల టన్నులు సాధించిందని తెలిపారు. జీడీ కే ఓసీపీ5 1.73లక్షల టన్నులకు 2.22లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సా ధించిందని చెప్పారు. భూగర్భ గనులు, ఓసీపీ 2.89లక్షల టన్నులకు 3.29లక్షల టన్నులు సాధించిందని ఆయన వివరించారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు, త్వరలోనే కార్మికవాడల్లో రక్షిత నీటిని అందించడానికి ఆర్‌ఓఆర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు, ఫిల్టర్‌బెడ్‌ ల నిర్మాణం కూడా త్వరలోనే పూర్తికానున్నట్టు చెప్పారు. జీడీకే ఓసీపీ5 లో కొత్తగా మూడు డంపర్లను ప్రవేశపెట్టామని, దీంతో బొగ్గు ఉత్పత్తి కూడా అధికంగా వెలికితీస్తామని చెప్పారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్ప త్తిని వెలికితీసి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నా రు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఓటూ జీఎం రాంమోహన్‌, ఓసీపీ5 పీఓ చంద్రశేఖర్‌, అధికారులు లక్ష్మీనారాయణ, కిరణ్‌రాజ్‌కుమార్‌, నవీన్‌, మదన్మోహన్‌, ఆంజనేయులు, జగన్మోహన్‌రావు, ఆంజనేయప్రసాద్‌, వీరా రెడ్డి, బంగారు సారంగపాణి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:17:14+05:30 IST