117 జీవోని తక్షణమే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-08-12T05:40:37+05:30 IST

ప్రభుత్వ ఉత్తర్వులు 117ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను నిర్బంధించారు. దీంతో ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకోవడంతో వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు ఏపీటీఎఫ్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఒకటో పట్టణ స్టేషన్‌కు తరలించారు.

117 జీవోని తక్షణమే రద్దు చేయాలి
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

ఏపీటీఎఫ్‌ నాయకుల డిమాండ్‌
అడ్డుకున్న పోలీసులు.. పలువురి అరెస్టు

కలెక్టరేట్‌, ఆగస్టు 11: ప్రభుత్వ ఉత్తర్వులు 117ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను నిర్బంధించారు. దీంతో ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకోవడంతో వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు ఏపీటీఎఫ్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఒకటో పట్టణ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకుం దని విమర్శించారు. ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను పోలీసులతో బలవంతంగా అరెస్టులు చేయించడం దారుణమన్నారు. 3, 4, 5 తరగతులను విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్‌ దెబ్బతింటుందన్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అన్ని పాఠశాల్లో ఆంగ్ల, తెలుగు మాధ్యమాలు అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉధ్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సంఘ నాయకులు మజ్జి మదన్‌మోహన్‌, బి.ఢిల్లేశ్వరరావు, సీహెచ్‌.శ్రీనివాస్‌, డి.రామ్మోహనరావు, ఎస్‌.చాణక్య, వి.నవీన్‌కుమార్‌, డి.వీరయ్య, ఎం.గుగేశ్వరీ, ఎల్‌.కరుణాకర్‌, బి.నేతాజీ, కె.వేణుగోపాలరావు కె.పాపారావు, సత్యనారాయణ, బీవీ రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T05:40:37+05:30 IST