1,140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ

ABN , First Publish Date - 2022-09-24T20:49:59+05:30 IST

వైద్య శాఖలో 1,140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు(Assistant Professor Post)ల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్‌ రావు(Minister Harish Rao) తెలిపారు. రానున్న పది

1,140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ

రెండు రోజుల్లో నోటిఫికేషన్‌

10 రోజుల్లో వెయ్యి మంది వైద్యుల భర్తీ

ఆస్పత్రికో ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ కమిటీ

వారానికోసారి సమీక్షించేలా ఏర్పాట్లు

రెండేళ్లకు ఒక సారి వైద్యులకు శిక్షణ

పేదలకు ఉత్తమ సేవలందాలి: హరీశ్‌

నిమ్స్‌లో హాస్పిటల్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రివెన్షన్‌, 

కంట్రోల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం


హైదరాబాద్‌ సిటీ/యూసు్‌ఫగూడ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వైద్య శాఖలో 1,140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు(Assistant Professor Post)ల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్‌ రావు(Minister Harish Rao) తెలిపారు. రానున్న పది రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెయ్యి మంది వైద్యులను నియమిస్తామని వెల్లడించారు. నిమ్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న హాస్పిటల్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు తగ్గించడానికి మూడంచెల విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి ఆస్పత్రిలో కమిటీ ఏర్పాటు చేస్తామని, ఇందులో సూపరింటెండెంట్‌, మైక్రో బయాలజీ హెచ్‌వోడీ, నర్సింగ్‌ హెచ్‌వోడీ ఉంటారని తెలిపారు. వీరు ప్రతి సోమవారం సమావేశమై పరిస్థితులపై చర్చిస్తారని పేర్కొన్నారు.  


ఇందులో భాగంగా తొలుత బోధనాస్పత్రులు, తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్‌, ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆపరేషన్‌ థియేటర్లు, ప్రసూతి వార్డుల్లో పరిశుభ్రత పాటించాలని, అక్కడ గాలి కూడా స్వచ్ఛంగా ఉండేలా చూడాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ల వద్ద భారీగా నిధులు ఉన్నాయని, అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలని సూచించారు. రూ.20కోట్లతో ఎక్వి్‌పమెంట్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ తీసుకొచ్చామని, ఫోన్‌ కాల్‌ లేదా మెయిల్‌ చేస్తే పరికరాలకు మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రూ.30 కోట్లతో మార్చురీలను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. 56 అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ మిషన్లు తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. పేదలకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో ఎంఎంఆర్‌, ఐఎంఆర్‌ గణనీయంగా తగ్గిందని, ఎంఎంఆర్‌లో తమిళనాడును దాటి రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. అనంతరం నిమ్స్‌లోని ఈఎండీ వార్డును సందర్శించిన హరీశ్‌రావు.. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై రోగులతో మాట్లాడారు.

Updated Date - 2022-09-24T20:49:59+05:30 IST