ఉదయం 11.30కే గ్రామ సచివాలయం ఖాళీ..!

ABN , First Publish Date - 2022-05-12T05:03:01+05:30 IST

మ, వార్డు సచివాల యాల్లో సిబ్బంది సమయానికి హాజరై ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి.

ఉదయం 11.30కే గ్రామ సచివాలయం ఖాళీ..!
సిబ్బంది లేకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు

అధికారుల హెచ్చరికలు బేఖాతరు

మూవ్‌మెంటు వివరాల నమోదు సున్నా..

మదనపల్లె టౌన్‌, మే 11: గ్రామ, వార్డు సచివాల యాల్లో సిబ్బంది సమయానికి హాజరై ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి. ప్రతి రోజు మూడు సార్లు బయోమెట్రిక్‌ వేసి హాజరు నమోదు చేసుకోవాలని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా పలు సచివాలయాల్లో సిబ్బంది పెడచెవిన పెడుతు న్నారు. క్షేత్రస్థాయి విధులకు వెళ్లేటప్పుడు మూవ్‌ మెంట్‌ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేసి వెళ్లా లని నిబంధనలు ఉన్నా సిబ్బంది పాటించడం లేదు. మదనపల్లె మండలం దుబ్బిగానిపల్లె గ్రామ సచివాలయంలో బుధవారం ఉదయం 11.20 గంటలకు సచివాలయం అంతా బోసిపోయి కనిపిం చింది. పలు సేవల కోసం సచివాలయానికి వచ్చిన ప్రజలకు ఇక్కడ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. కేవలం డిజిటల్‌ అసిస్టెం ట్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ మాత్రమే  కనిపించారు. 

కాగా ఈ సచివాలయంలో పనిచేస్తున్న వీఆర్వో కృష్ణ మూర్తి సస్పెండ్‌ కాగా, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మీటింగ్‌ కోసం మదనపల్లె ఎంపీడీ వో కార్యాలయానికి వెళా ్లరు. సచివాలయ సెక్రటరీ దీర్ఘకాలిక సెలవులో వు న్నారు. ఇకపోతే హాజరు పట్టికలో గ్రామమహిళా పో లీసు రెడ్డెమ్మ, అనిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ సుకన్య సంతకాలు పెట్టి, మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో నమోదు చేసి క్షేత్రస్థాయి విధులకు వెళ్లారు. ఇంజ నీరింగ్‌ అసిస్టెంట్‌ అశోక్‌ కుమార్‌, ఏఎన్‌ఎం శోభారాణి హాజరుపట్టికలో సంతకాలు పెట్టకపోగా,  కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో కూడా  లేరు. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ప్రసాద్‌ హాజరు పట్టికలో సంతకం పెట్టినా సచివాలయంలో కనిపించలేదు. ఇదీ దుబ్బుగారిపల్లె సచివాలయంలో పరిస్థితి 


Read more