నా దీర్ఘాయువు సీక్రెట్‌.. కోడి మెదడు తిన‌డ‌మే: 111ఏళ్ల వృద్ధుడు

ABN , First Publish Date - 2021-05-18T15:24:09+05:30 IST

డెక్స్‌టర్‌ క్రూగర్‌.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఒక పశువుల ఫాం యజమాని. సోమవారంతో ఆయనకు 111ఏళ్ల 124 రోజులు నిండాయి.

నా దీర్ఘాయువు సీక్రెట్‌.. కోడి మెదడు తిన‌డ‌మే: 111ఏళ్ల వృద్ధుడు

కాన్‌బెర్రా: డెక్స్‌టర్‌ క్రూగర్‌.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఒక పశువుల ఫాం యజమాని. సోమవారంతో ఆయనకు 111ఏళ్ల 124 రోజులు నిండాయి. క్రూగర్‌ దీర్ఘాయువుకు కోడి మెదడే కారణమట! ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయం చెప్పాడు. ‘కోళ్లకు మెదడు ఉంటుంది కదా.. వాటిలో చిన్నగా రుచికరమైనవి కొన్నుంటాయి. వాటిని తినడం వల్ల నేను ఇన్నేళ్లు.. ఇంకా జీవిస్తున్నాను’ అని సెలవిచ్చాడు. ఇప్పటి వరకూ 114 ఏళ్ల 148 రోజులపాటు జీవించి 2002లో చనిపోయిన క్రిస్టినా కుక్‌ పేరు మీదే అత్యధిక కాలం జీవించిన రికార్డు ఉంది.  

Updated Date - 2021-05-18T15:24:09+05:30 IST