11ఏళ్ల చిన్నోడు.. సోషల్ మీడియాలో వీడియో చూసి అనూహ్య నిర్ణయం.. కానీ అతడి ఆశలు ఆవిరి!

ABN , First Publish Date - 2022-03-18T01:16:15+05:30 IST

ఆ చిన్నోడికి కేవలం 11ఏళ్లే. కానీ అతడు చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఒకే ఒక్క వీడియో చూసి కీలక నిర్ణయం తీసుకున్నాడు. పట్టుబట్టి మరీ ల్యాండ్ (భూమి) కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది.

11ఏళ్ల చిన్నోడు.. సోషల్ మీడియాలో వీడియో చూసి అనూహ్య నిర్ణయం.. కానీ అతడి ఆశలు ఆవిరి!

ఇంటర్నెట్ డెస్క్: ఆ చిన్నోడికి కేవలం 11ఏళ్లే. కానీ అతడు చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఒకే ఒక్క వీడియో చూసి కీలక నిర్ణయం తీసుకున్నాడు. పట్టుబట్టి మరీ ల్యాండ్ (భూమి) కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది? ఆ చిన్నోడు ల్యాండ్‌ను ఎందుకు కొనుగోలు చేశాడు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఐస్‌ల్యాండ్‌కు చెందిన అర్నాల్దుర్‌కు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే ఓ వీడియో అతడి కంటపడింది. స్కాట్‌ల్యాండ్‌లో ల్యాండ్ ఉన్న వారి పేర్ల ముందు ‘లార్డ్’ అనే పదం ఉండటాన్ని గుర్తించాడు. అక్కడ ల్యాండ్ కొనుగోలు చేస్తే తన పేరు ముందు కూడా ఆ పదం వచ్చి చేరుతుందని భావించాడు. నలుగురితో ‘లార్డ్’ అని పిలిపించుకోవాలని ఆశపడ్డాడు. అంతే.. ఇంట్లో పట్టుబట్టి మరీ తల్లిదండ్రులతో ఐదు చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేయించాడు. దీంతో ఇకపై తనను అందరూ లార్డ్‌గా గుర్తిస్తారని ఆ చిన్నోడు సంబరపడిపోయాడు. అయితే అతడి ఆశలు అడియాసలయ్యాయి. అర్నాల్దుర్ క్జర్ ఆర్నోర్సన్‌ను ఎవరూ లార్డ్‌గా గుర్తించకపోవడంతో నిరాశకు లోనయ్యాడు.




Updated Date - 2022-03-18T01:16:15+05:30 IST