మోదీ కేబినెట్‌లో 11 మంది మహిళలు.. 17 ఏళ్లలో ఇదే గరిష్టం

ABN , First Publish Date - 2021-07-14T22:59:15+05:30 IST

2009లో ప్రధాని మోదీ రెండవ కేబినెట్‌లో ఆరుగురు మహిళా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ముగ్గురికి కేబినెట్ ర్యాంక్ ఉంది. కాగా తాజాగా ఈ సంఖ్య 11కు పెరిగినప్పటికీ కేబినెట్ ర్యాంక్ మాత్రం ఇద్దరు

మోదీ కేబినెట్‌లో 11 మంది మహిళలు.. 17 ఏళ్లలో ఇదే గరిష్టం

న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితమే ప్రధానమంత్రి తన కేబినెట్‌లో కీలక మార్పులు చేశారు. కేబినెట్‌లోకి కొంత మందిని చేర్చుకుంటూనే ఇప్పటికే కేబినెట్‌లో ఉన్న కొంత మందిని తప్పించారు. ఈ మార్పులతో మోదీ కేబినెట్ 78కి చేరింది. అయితే ఇందులో 11 మహిళా మంత్రులు ఉండడం గమనార్హం. మరో ప్రత్యేకత ఏంటంటే.. కేంద్ర కేబినెట్‌లో ఇంత ఎక్కువ మంది మహిళలు ఉండడం 17 ఏళ్లలో ఇదే గరిష్టం. తాజా చేరికలో ఏడుగురు మహిళలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇప్పటికే నలుగురు మహిళా మంత్రులు (నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుక సింగ్ సతుర) లను కలుపుకుంటే ఈ సంఖ్య 11కు చేరింది.


కొత్తగా కేబినెట్‌లో చేరిన మహిళలు

మీనాక్షి లేఖి

అనుప్రియ పటేల్

దర్శన జర్దోశ్

భారతి పవార్

అన్నపూర్ణ దేవి

ప్రతిమ భౌమిక్

శోభా కరడ్లాజే


2009లో ప్రధాని మోదీ రెండవ కేబినెట్‌లో ఆరుగురు మహిళా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ముగ్గురికి కేబినెట్ ర్యాంక్ ఉంది. కాగా తాజాగా ఈ సంఖ్య 11కు పెరిగినప్పటికీ కేబినెట్ ర్యాంక్ మాత్రం ఇద్దరు మంత్రులకు మాత్రమే ఉంది. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ మాత్రమే మోదీ మంత్రివర్గంలో కేబినెట్ ర్యాంక్ హోదా కలిగి ఉన్నారు.

Updated Date - 2021-07-14T22:59:15+05:30 IST