అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్!

ABN , First Publish Date - 2020-10-24T00:22:33+05:30 IST

అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారనే కారణంతో దాదాపు 15 మంది విద్యార్థులను బుధవారం రోజు వేరువేరు చోట్ల అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 11 మంది భారత్‌కు చెందిన విద్యార్థులు ఉ

అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్!

వాషింగ్టన్: అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారనే కారణంతో దాదాపు 15 మంది విద్యార్థులను బుధవారం రోజు వేరువేరు చోట్ల అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 11 మంది భారత్‌కు చెందిన విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. చదువు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు.. అమెరికాలో ఉంటూ వారి వారి రంగాల్లో ఏడాదిపాటు ఉద్యోగాలు చేసుకోవడానికి ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రాం అవకాశం కల్పిస్తుందన్నారు. స్టెమ్ ఓపీటీలో పాల్గొంటే మరో 24 నెలలపాటు అక్కడే ఉండొచ్చన్నారు. అయితే ఈ 15 మంది విద్యార్థులు.. అమెరికాలో ఉండేందుకు  ఓపీటీని దుర్వినియోగం చేసినట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి ఉద్యోగం చేయకుండానే ఓపీటీ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎజెన్సీ అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-24T00:22:33+05:30 IST