Viral: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. స్విమ్మింగ్‌పూల్‌లో ఉండగా తల్లికి ఫిట్స్ రావడం చూసి ఆ బాలుడు...

ABN , First Publish Date - 2022-08-31T02:35:07+05:30 IST

పదేళ్ల వయసున్న ఓ పిల్లాడిని నెటిజన్లను ప్రస్తుతం పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. నువ్వు నిజ జీవితంలో హీరోవి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రాణాపాయంలో ఉన్న తల్లిని అతడు రక్షించిన తీరు చూసి అందరూ ముగ్ధులవుతున్నారు.

Viral: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. స్విమ్మింగ్‌పూల్‌లో ఉండగా తల్లికి ఫిట్స్ రావడం చూసి ఆ బాలుడు...

ఎన్నారై డెస్క్: పదేళ్ల వయసున్న ఓ పిల్లాడిని నెటిజన్లను ప్రస్తుతం పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. నువ్వు నిజ జీవితంలో హీరోవి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రాణాపాయంలో ఉన్న తల్లిని అతడు రక్షించిన తీరు చూసి అందరూ ముగ్ధులవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 


అమెరికాకు చెందిన గెవిన్ కీనీ(Gavin keeney) అనే బాలుడు తన కుటుంబంతో కలిసి ఓక్లహోమా(Oklahoma) రాష్ట్రంలోని కింగ్‌స్టన్(Kingston) అనే టౌన్‌లో ఉంటాడు. ఇటీవల ఓ రోజు అతడి తల్లి ఓ చిన్న స్విమ్మింగ్‌ పూల్‌లో(Swimming pool) ఉండగా అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దీంతో.. ఆమె గిలిగిలా కొట్టుకుంటూ నీటిలో మునిగిపోసాగింది(Drowning). ఇదంతా చూసిన గెవిన్ మెరుపు వేగంతో స్పందించాడు. వెంటనే స్విమ్మింగ్ పూల్‌లో దూకి తల్లి మునుగిపోకుండా పట్టుకున్నాడు. మెల్లగా పూల్ మెట్ల వద్దకు తీసుకొచ్చాడు. అప్పటికి గిలగిలా కొట్టుకుంటున్న ఆమె నీటిలోకి జారి పోకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు. ఆమె తల మునగకుండా ఉండేందుకు విశ్వప్రయత్నమే చేశాడు. అయితే.. ఇదంతా గమనించిన అతడి తాత వెంటనే  ఆమెను బయటకు తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 


ఈ వీడియోను స్థానిక మీడియా సంస్థ నెట్టింట్లో పెట్టడంతో ఇది తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకైపోతున్నారు. అదే సమయంలో..తన తల్లిని రక్షించుకున్న గెవిన్‌ను తెగమెచ్చుకుంటున్నారు. ‘‘తల్లి పట్ల అతడికున్న ఆప్యాయత, బాధ్యత చూస్తుంటే ముచ్చటేస్తోంది’’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఇక స్థానిక పోలీసులు గెవిన్ ధైర్యసాహసాలను గుర్తిస్తూ ఓ అవార్డును కూడా అందజేశారు. ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియోపై మీరు ఓలుక్కేయండి.



Updated Date - 2022-08-31T02:35:07+05:30 IST