Advertisement
Advertisement
Abn logo
Advertisement

అత్యంత సమీపంలో 10 అడుగుల పైథాన్.. అయినా బెదరని మహిళ.. చివరికి

సిడ్నీ: సరుకుల కోసం సూపర్ మార్కెట్‌కు వెళ్లి, అక్కడ కావాల్సినవి వెతుక్కుంటుండగా.. అకస్మాత్తుగా 10 అడుగుల పాము దర్శనమిస్తే ఎలా ఉంటుంది? సాధారణంగా ఎవ్వరైనా భయంతో హడలిపోతారు కదా. కానీ ఓ మహిళ మాత్రం అస్సలు భయపలేదు. ఆమె చేసిన పనికి సంబంధించిన వార్త ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఆమె ఏం చేసిందో తెలిస్తే సదరు మహిళను మీరు కూడా ప్రశంసించకుండా ఉండరేమో. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిడ్నీకి సంబంధించిన హెలైన్ అనే మహిళ సరుకుల కోసం తాజాగా స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్‌లోకి వెళ్లారు. 


తనకు కావాల్సిన వాటికి కోసం ఆమె వెతుకుతున్న తరుణంలో ర్యాక్‌ల మధ్యలోంచి సుమారు 10 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది. 10 అడుగుల కొండచిలువను అకస్మాత్తుగా చూసే సరికి హెలైన్ మొదటగా కొంచెం షాక్ అయ్యారు. అనంతరం ఆమె షాక్ నుంచి తేరుకుని.. సూపర్ మార్కెట్‌లో ఉన్నవారిని అప్రమత్తం చేశారు. ఆ ఫైథాన్‌ను తానే బంధించి అడవిలో వదిలిపెడతానని వారికి ధైర్యం చెప్పి ఇంటికి వెళ్లిపోయారు. ఓ బ్యాగుతో తిరిగొచ్చిన ఆమె.. జాగ్రత్తగా కొండ చిలువను అందులో బంధించారు. అనంతరం దాన్ని దగ్గరలోని అడవిలో విడిచిపెట్టారు. తర్వాత ఆమె మాట్లాడుతూ.. తాను పాములను పట్టడంలో శిక్షణ పొందినట్టు వివరించారు. అయితే సదరు కొండచిలువలో మగదని.. ఆడ తోడు కోసం వెతుక్కుంటూ సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement