కరోనా రిపోర్ట్: తమిళనాడులో మూడో రోజూ 1000కిపైగా కేసులు

ABN , First Publish Date - 2020-06-03T00:21:36+05:30 IST

తమిళనాడులో కరోనా కోరలు చాస్తోంది. మూడు రోజుల నుంచి ప్రతి రోజూ వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు ...

కరోనా రిపోర్ట్: తమిళనాడులో మూడో రోజూ 1000కిపైగా కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా కోరలు చాస్తోంది. మూడు రోజుల నుంచి ప్రతి రోజూ వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,091 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది మృత్యువాత పడ్డారు. 536 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోకి మొత్తం కేసుల సంఖ్య 24,586కు చేరింది. 13,706 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 199మంది మరణించారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ 10,681 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-06-03T00:21:36+05:30 IST