Abn logo
Jul 5 2020 @ 06:24AM

108 వాహనాలు ప్రారంభం

గార/ఇచ్ఛాపురం/సరుబుజ్జిలి/లావేరు: జిల్లాలో పలుచోట్ల 108, 104 వాహనాలను శనివారం ప్రారంభించారు. పాలకొండలో ఎమ్మెల్యే  కళావతి, డీసీసీబీ చైర్మన్‌ పాలవలస విక్రాంత్‌, ఇచ్ఛాపురం పీహెచ్‌సీలో  డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌,  సరుబుజ్జిలి పీహెచ్‌సీ  పరిధిలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి భారతీదేవి, గారలో వైసీపీ నాయకుడు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, లావేరు మండలం తాళ్లవలసలో వైసీపీ జిల్లా  ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్‌ ఈ వాహనాలను ప్రారంభించారు.


అత్యవసర సమయాల్లో ప్రజలు ఈ వాహనాలను వినియోగించుకోవాలని కోరారు. గారలో నిర్వహించిన కార్యక్రమంలో  వైసీపీ నాయకులు ముంజేటి కృష్ణమూర్తి, పీస శ్రీహరి, 108 ఫైలెట్స్‌ టీవీ రవికుమార్‌, కె.నారాయణరావు, ధర్మారావు, టెక్నీషియన్లు హెచ్‌.ఆనందరావు, జి.మాణిక్యాలరావు, కె.హరీష్‌, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement