టిప్ టాప్‌గా తయారై.. 108 సిబ్బందితో ఎకసెక్కాలు

ABN , First Publish Date - 2021-02-27T21:33:12+05:30 IST

108 అంటే ఆపత్కాలంలో ఆదుకునే వాహనం. ప్రమాదాలు జరిగినప్పుడు, వైద్యసేవలు

టిప్ టాప్‌గా తయారై.. 108 సిబ్బందితో ఎకసెక్కాలు

ఇంటర్నెట్ డెస్క్: 108 అంటే ఆపత్కాలంలో ఆదుకునే వాహనం. ప్రమాదాలు జరిగినప్పుడు, వైద్యసేవలు అత్యవసరం అయిన సమయంలో అవి అందించే సేవలు అనిర్వచనీయం. అలాంటి అత్యవసర వాహనాన్ని ఓ ఆకతాయి... తన అవసరాలకు వినియోగించుకోదలచాడు. వెంటనే 108కి ఫోన్ చేసి... అర్జంట్ అంటూ కంగారు పెట్టాడు. పాపం వాళ్లు హడావుడిగా అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే మనోడు ... టిప్ టాప్‌గా తయారై.. చంకలో దుప్పటితో రెడీగా ఉన్నాడు. ఏంట్రా ఇది అని అడిగితే... నవ్వుతూ... కాళ్ల నొప్పులున్నాయి.. అందుకే ఫోన్ చేశా అన్నాడు. దీంతో 108 సిబ్బందికి చిర్రెత్తుకు వచ్చింది. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే... ఇలా ఎందుకు తయారయ్యావు అని అడిగితే... మరింత ఎగతాళిగా సమాధానమిచ్చాడు. అతడి సమాధానానికి వాళ్ల కోపం నషాళానికి ఎక్కింది. గతంలో కూడా పలుమార్లు అతడు ఇలాగే 108 వాహనానికి ఫోన్ చేశాడని సిబ్బంది చెబుతున్నారు.


ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. జరిగిన ప్రాంతం... ఆకతాయి పేరు.. తదితర విషయాలు తెలియడం లేదు. కానీ అతడి ప్రవర్తన పట్ల పలువురు మండిపడుతున్నారు. 108 వాహనం గురించి తెలిసి కూడా ఇలా దుర్వినియోగం చేయడం ఎంత వరకు తగునని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిని అసలు ఉపేక్షించకూడదని వ్యాఖ్యానిస్తున్నారు.    



Updated Date - 2021-02-27T21:33:12+05:30 IST