108కి సుస్తీ

ABN , First Publish Date - 2022-09-08T05:59:13+05:30 IST

పట్టణంలోని 108 అంబులెన్స్‌కు నాలుగు రోజులుగా సుస్తీ చేసిం ది.

108కి సుస్తీ


నూజివీడు టౌన్‌, సెప్టెంబరు 7: పట్టణంలోని 108 అంబులెన్స్‌కు నాలుగు రోజులుగా సుస్తీ చేసిం ది. ఎప్పుడు ఆగుతుందో ఎక్కడ ఆగుతుందో తెలియక రోగులు, వైద్య సిబ్బంది ఆందోళన చెందు తున్నారు. దీంతో క్షతగాత్రులు 108 కోసం ఆగే కన్నా వేరే వాహనాలు చూసుకుని వెళ్ళటం మేలు అనే పరిస్థితికి వచ్చారు. మంగళ, బుధవారాల్లో వాహనం మొరాయించడంతో 108 సిబ్బందిలో అయోమయం నెలకొంది. బుధవారం దిగవల్లిలో వాహనం నిలిచి పోవడంతో సిబ్బంది ఆ వాహనాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. మంగళవారం మిట్టగూడెంలో ఒక వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు 108కి సమాచారమివ్వగా ఎంతసే పటికి వాహనం రాకపోవడంతో క్షత గాత్రుడి ప్రా ణాలు కాపాడేందుకు స్థానికులు ఆటోలో తరలిం చేందుకు ప్రయత్నించారు. హనుమంతులగూడెం సమీపంలోకి వచ్చే సరికి 108 రావడం, క్షతగాత్రు డిని అంబులెన్స్‌లోకి ఎక్కించారు. అక్కడి నుంచి కదిలేందుకు వాహనం మొండికేయడంతో  మరలా క్షతగాత్రుడిని తిరిగి ఆటోలో ఎక్కించుకుని బాధితు లు నూజివీడు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో నూజివీడు మండలంలో 108 సేవల పై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-09-08T05:59:13+05:30 IST