108 సిబ్బంది వినూత్న నిరసన

ABN , First Publish Date - 2022-05-29T06:16:19+05:30 IST

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు 108 కాంట్రాక్ట్‌ ఉద్యోగులు మోకాళ్లపై నిలిచి శనివారం నిరసన తెలిపారు. ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో నర్సీపట్నం, నాతవరం, ఎస్‌.రాయవరం, కొయ్యూరు మండలాల పరిధిలో సేవలు అందిస్తున్న 108 ఉద్యోగులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమ స్యలను పరిష్కరించాలని నినా దాలు చేశారు.

108 సిబ్బంది వినూత్న నిరసన
మోకాళ ్లపై నిలిచి నిరసన తెలియజేస్తున్న 108 సిబ్బంది

 

ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో మోకాళ్లపై నిలిచి నినాదాలు

డిమాండ్లు పరిష్కరించకుంటే ఏ క్షణంలోనైనా సమ్మె

సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రసాద్‌ హెచ్చరిక

నర్సీపట్నం, మే 28 : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు 108 కాంట్రాక్ట్‌ ఉద్యోగులు మోకాళ్లపై నిలిచి శనివారం నిరసన తెలిపారు. ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో నర్సీపట్నం, నాతవరం, ఎస్‌.రాయవరం, కొయ్యూరు మండలాల పరిధిలో సేవలు అందిస్తున్న 108 ఉద్యోగులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమ స్యలను పరిష్కరించాలని నినా దాలు చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 19వ తేదీన ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు.  పధ్నా లుగు రోజుల్లో డిమాండ్లను పరిష్కరిం చకుంటే ఏ క్షణంలోనైనా సమ్మెలోకి వెళతామని 108 సేవల కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీటీఎస్‌ ప్రసాద్‌ హెచ్చరించారు. 

Updated Date - 2022-05-29T06:16:19+05:30 IST