108 వాహనంలోనే ప్రసవం

ABN , First Publish Date - 2021-08-06T06:28:57+05:30 IST

పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మి గురువారం 108 వాహనంలో ఆడశిశువుకు జన్మనిచ్చింది.

108 వాహనంలోనే ప్రసవం
శిశువును చూపుతున్న 108 సిబ్బంది


తాడిపత్రిటౌన్‌, ఆగస్టు 5 : పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మి గురువారం 108 వాహనంలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. నాగలక్ష్మికి గురువారం తెల్లవారుజామున పురిటినొప్పులు రావడంతో ఆశావర్కర్‌ రామాంజులమ్మ 108కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఉత్తన్న, కొండయ్య తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పెద్దపొలమడ గ్రామ సమీపంలో నొప్పులు అధి కం కావడంతో 108 సిబ్బంది ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షే మంగా ఉన్నారు. వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-08-06T06:28:57+05:30 IST