106 మంది ప్రయాణికులు.. 7గంటలపాటు రైల్లోనే.. ఇంతకూ ఏం జరిగిందంటే!

ABN , First Publish Date - 2022-02-17T00:57:23+05:30 IST

పవర్ సప్లై నిలిచిపోవడంతో దాదాపు 106 మంది ప్రయాణికులు ట్రైన్‌లో చిక్కుకున్న ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. సుమారు ఏడు గంటలపాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డట్టు సమాచారం. కాగా.. ఇందుకు

106 మంది ప్రయాణికులు.. 7గంటలపాటు రైల్లోనే.. ఇంతకూ ఏం జరిగిందంటే!

వాషింగ్టన్: పవర్ సప్లై నిలిచిపోవడంతో దాదాపు 106 మంది ప్రయాణికులు ట్రైన్‌లో చిక్కుకున్న ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. సుమారు ఏడు గంటలపాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డట్టు సమాచారం. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సుమారు 106 మంది ప్రయాణికులతో బోస్టన్ నుంచి వాషింగ్టన్‌కు ఓ ట్రైన్ బయల్దేరింది. ఈ క్రమంలోనే విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో ట్రైన్ న్యూయార్క్‌లో ఆగిపోయింది. దీంతో సుమారు 7 గంటలపాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అయితే.. ప్రయాణికులకు కానీ రైల్లో పని చేసే సిబ్బందికికానీ ఎటువంటి హాని కలగలేదని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు నీళ్లు, స్నాక్స్ అందించినట్టు ట్రైన్ ప్రతినిధులు పేర్కొన్నారు. 




Updated Date - 2022-02-17T00:57:23+05:30 IST