Abu Dhabi gas explosion: 100 మందికి పైగా భారత ప్రవాసులకు గాయాలు.. ఇద్దరు మృతి!

ABN , First Publish Date - 2022-05-25T18:54:10+05:30 IST

యూఏఈ రాజధాని అబుదాబిలోని ఓ రెస్టారెంట్‌లో సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో 106 మంది భారత ప్రవాసులు గాయపడినట్లు భారత ఎంబసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Abu Dhabi gas explosion: 100 మందికి పైగా భారత ప్రవాసులకు గాయాలు.. ఇద్దరు మృతి!

అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబిలోని ఓ రెస్టారెంట్‌లో సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో 106 మంది భారత ప్రవాసులు గాయపడినట్లు భారత ఎంబసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలాగే ఇద్దరు ప్రవాసులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒకరు భారత్‌కు చెందిన వ్యక్తి కాగా, మరోకరు పాక్ పౌరుడని తెలిపారు. ఖలీడియా ప్రాంతంలోని ఫుడ్ కేర్ అనే రెస్టారెంట్‌లో సోమవారం ఈ పేలుడు సంభవించింది. ఇక గాయపడిన వారిని అబుదాబిలోని వివిధ ఆస్పత్రుల్లో చేరిపించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం అబుదాబి హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనియర్ అధికారులు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అబుదాబిలోని హెల్త్ డిపార్ట్‌మెంట్ చైర్మన్ అబ్దుల్లా బిన్ మహ్మద్ అల్ హమద్, డిఓహెచ్ అండర్ సెక్రటరీ డాక్టర్ జమాల్ మహ్మద్ అల్ కాబీ గాయపడిన వారితో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్య సిబ్బందిని ఆదేశించారు. 


Updated Date - 2022-05-25T18:54:10+05:30 IST