105వ రోజు నిరసన

ABN , First Publish Date - 2021-02-27T05:11:15+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూముల్లో వైద్య కళాశాల వద్దని, అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు.

105వ రోజు నిరసన
ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులు

నంద్యాల (ఎడ్యుకేషన్‌), ఫిబ్రవరి 26: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూముల్లో వైద్య కళాశాల వద్దని, అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూముల్లో వైద్య కళాశాల ఏర్పాటుకు నిరసనగా ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు శుక్రవారం 105వ రోజుకు చేరుకున్నాయి. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఎదుట కార్మికులు బైఠాయించి నిరసన చేపట్టారు. సీఐటీయూ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ వైద్య కళాశాలను వేరే ప్రభుత్వ భూముల్లో నిర్మించాలని, లేదా రూ.200 కోట్లతో ప్రైవేటు భూములను కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నంద్యాల అభివృద్ధిపై ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని, అభివృద్ధి చెందిన సంస్థలను నాశనం చేయడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యేల స్వలాభం కోసమే ఆర్‌ఏఆర్‌ఎస్‌లో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రమణ, ఖాదర్‌వలి, గోపాల్‌, ఎల్లమ్మ, పుల్లమ్మ, నాగేశ్వరమ్మ, మైమున్నీసా, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:11:15+05:30 IST