ఆసుపత్రుల్లో 7,385 మంది
విజయవాడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా మహమ్మారి దూకుడు పెంచింది. నగరంతో పాటు పట్టణాలు, పల్లెలకూ వైరస్ విస్తరించడంతో రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య భారీస్థాయిలో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,056 మంది కొవిడ్ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 1,28,748కి ఎగబాకింది. ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 7,385కు చేరింది. మరణాలు మాత్రం 1,482 వద్ద నిలకడగానే ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారిలో 1,19,881 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.