Saudi Arabia: కేవలం వారం రోజుల్లో 10వేల మంది విదేశీయులు అరెస్ట్!

ABN , First Publish Date - 2022-07-18T18:32:04+05:30 IST

సౌదీ అరేబియా.. ఇక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సుమారు.. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 10వేల మందికిపైగా విదేశీ పౌరులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలై 7-13 మధ్య

Saudi Arabia: కేవలం వారం రోజుల్లో 10వేల మంది విదేశీయులు అరెస్ట్!

ఎన్నారై డెస్క్: సౌదీ అరేబియా.. ఇక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సుమారు.. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 10వేల మందికిపైగా విదేశీ పౌరులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలై 7-13 మధ్య రెసిడెన్సీ, లేబర్, బార్డర్ సెక్యూరిటీ చట్టాలు ఉల్లఘించిన కారణంగా 10,401 మంది విదేశీ పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. 


అరస్ట్ అయిన వారిలో 6,786 మంది రెసిడెన్సీ చట్టాలను, 2,444 మంది బార్డర్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్‌ను మరో 1,171 మంది లేబర్ చట్టాలను ఉల్లఘించినట్టు తెలిపింది. సౌదీ అరేబియాలోకి అక్రమంగా చొరబడుతూ మరో 203 మంది విదేశీ పౌరులు పట్టుబడ్డారని ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. పట్టబడ్డ వారిలో 31శాతం మంది యెమన్ దేశస్థులు, 57శాతం మంది ఇథియెపియా.. మరో 12శాతం మంది ఇతర దేశాల వాళ్లు ఉన్నారని పేర్కొంది. 


Updated Date - 2022-07-18T18:32:04+05:30 IST