ఆ పార్కులకు 104 ఏళ్లు

ABN , First Publish Date - 2020-08-25T05:30:00+05:30 IST

పర్వతాలు, సరస్సులు, పూలవనాలతో ప్రకృతి అందాలను కళ్ల ముందు నిలిపేవి జాతీయ పార్కులు.

ఆ పార్కులకు 104 ఏళ్లు

పర్వతాలు, సరస్సులు, పూలవనాలతో ప్రకృతి అందాలను కళ్ల ముందు నిలిపేవి జాతీయ పార్కులు. అందుకే అమెరికాలో వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. 

1. అక్కడ జాతీయ పార్కులను ఏటా సందర్శించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. జాతీయ పార్కులను దేశ సంపదగా పరిగణించి నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ (ఎన్‌పీఎస్‌) వాటిని సంరక్షిస్తూ ఉంటుంది. 

2. ప్రస్తుతం ఆమెరికాలో 62 జాతీయ పార్కులున్నాయి. ఈ రోజుకు వాటిని ప్రారంభించి 104 ఏళ్లు పూర్తవుతోంది. 

3. అవి ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు దాదాపు 33 కోట్ల మంది వాటిని సందర్శించారట.

4. మన దేశంలోనూ జాతీయ పార్కులున్నాయి. కన్హా, కాజీరంగా, పెరియార్‌, గిర్‌, సుందర్‌బన్‌, రణతంబోర్‌ జాతీయ పార్కులకు బాగా గుర్తింపు ఉంది. 

Updated Date - 2020-08-25T05:30:00+05:30 IST