కరోనాను ఓడించిన 104 ఏళ్ల వృద్ధురాలు... ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్!

ABN , First Publish Date - 2020-10-12T15:44:18+05:30 IST

ధైర్యంతో ఎంతటి విపత్తునైనా జయించవచ్చని ఒక వృద్ధురాలు నిరూపించింది. యూపీలోని నోయిడాకు చెందిన 104 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

కరోనాను ఓడించిన 104 ఏళ్ల వృద్ధురాలు... ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్!

నోయిడా: ధైర్యంతో ఎంతటి విపత్తునైనా జయించవచ్చని ఒక వృద్ధురాలు నిరూపించింది. యూపీలోని నోయిడాకు చెందిన 104 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అయితే ఆమె 60 ఏళ్ల కుమార్తె ప్రస్తుతం కరోనాతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళితే ఈ కరోనా బాధిత వృద్ధురాలు స్వాతంత్ర్య సమరయోధుడు పండిత్ భూప్ సింగ్ శర్మ భార్య. 



కరోనా నుంచి కోలుకున్న ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఈ సందర్భంగా జేపీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శైలేంద్ర గోయల్ మాట్లాడుతూ కరోనా బాధిత వృద్ధురాలి వయసు 104 ఏళ్లని తెలిపారు. ఆమె ఆసుపత్రిలో చేరగానే ఆమెకు ఆక్సిజన్ అవసరమయ్యిదని తెలిపారు. చికిత్స పూర్తయ్యి, కోలుకున్న అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఆమె కుమార్తె ఇటీవలే కరోనాతో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతున్నదన్నారు. 

Updated Date - 2020-10-12T15:44:18+05:30 IST