హైదరాబాద్‌లో 103 ఏళ్ల వృద్ధుడికి టీకా

ABN , First Publish Date - 2021-06-22T13:50:27+05:30 IST

102 వసంతాలు చూసిన కోరాడ రామచంద్ర శాస్త్రి

హైదరాబాద్‌లో 103 ఏళ్ల వృద్ధుడికి టీకా

హైదరాబాద్ సిటీ/నిజాంపేట్‌ : 102 వసంతాలు చూసిన కోరాడ రామచంద్ర శాస్త్రి (103) జీవితంలో మరో అరుదైన ఘట్టం ఇది. కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్న శతాధిక వృద్ధుల జాబితాలో ఆయన పేరు స్థానం సంపాదించుకుంది. ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి సిబ్బంది ఆయనకు టీకా వేశారు. చైన్నెకి చెందిన ఈ రిటైర్డ్‌ ఉపా ధ్యాయుడు 1918 జూన్‌ 15న జన్మించారు. ఆ సమయానికి దేశం యావత్తు స్పానిష్‌ ఫ్లూ మహమ్మారితో పోరాడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శాస్త్రి తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. శాస్త్రి కుమారుడు కేవీ శర్మ మాట్లాడుతూ ‘మా నాన్న గారి వయసు రీత్యా ఇది కుటుంబానికి చాలా కీలకమైన నిర్ణయం. ఆయనను ఉండే చోటు నుంచి కదిలించాల్సిన అవసరం లేకుండానే ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో అనుభవజ్ణులైన సిబ్బంది ఇంటికి వచ్చి టీకా వేశారు. ఆయన రోజూ వార్తలు తప్పనిసరిగా చూస్తుంటారు. కొవిడ్‌-19 మహమ్మారి గురించి ఆయనకు తెలుసు’ అని అన్నారు.

Updated Date - 2021-06-22T13:50:27+05:30 IST