కరోనాను జయించిన 103ఏళ్ల బామ్మ.. బీర్ తాగి..!

ABN , First Publish Date - 2020-05-30T22:51:52+05:30 IST

కరోనా వైరస్‌ను జయించిన ఓ 103ఏళ్ల బామ్మ.. తన సంతోషాన్ని చల్లటి బీర్ తాగి వ్యక్తపరిచిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని

కరోనాను జయించిన 103ఏళ్ల బామ్మ.. బీర్ తాగి..!

వాషింగ్టన్: కరోనా వైరస్‌ను జయించిన ఓ 103ఏళ్ల బామ్మ.. తన సంతోషాన్ని చల్లటి బీర్ తాగి వ్యక్తపరిచిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మస్సాచుసెట్స్‌కు చెందిన జెన్నీ స్టెజ్నా అనే 103ఏళ్ల బామ్మ.. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. జెన్నీ స్టెజ్నాను పరీక్షించిన వైద్యులు.. ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. హాస్పటల్‌లో చికిత్స పొందిన ఆమె కరోనా వైరస్‌ను జయించారు. ఈ నేపథ్యంలో ఓ చల్లటి బీర్ తాగి.. ఆమె తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. జెన్నీ స్టెజ్నా బీర్ తాగుతున్న దృశ్యాలను వీడియో తీసి.. ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల మంది కరోనా బారినపడగా.. మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. 


Updated Date - 2020-05-30T22:51:52+05:30 IST