టెంకాయలు కొడుతున్న టీడీపీ బీసీ విభాగం నాయకులు
బేతంచెర్ల, జనవరి 21: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కరోనా బారిన పడి కోలుకున్న శుభసందర్భంగా మండల పరిధిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన మద్దిలేటి స్వామి క్షేత్రంలో శుక్రవారం టీడీపీ బీసీ విభాగం నాయకులు 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అంబాపురం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఆర్.బుక్కాపురం సర్పంచ్ నాగరాజు, బేతంచెర్ల పట్టణానికి చెందిన పుట్టపాశం వెంకటేశ్వర్లు, టైలర్ రాముడు, విజయ్, పూల మద్దిలేటిస్వామి, రంగాపురం గ్రామానికి చెందిన గుడిసె మద్దిలేటిస్వామి, రహిమాన్‌పురం రాముడు, ముద్దవరం స్వాములు, భూపాల్ పాల్గొన్నారు.