హైదరాబాద్/గచ్చిబౌలి: హఫీజ్‌పేట, చందానగర్ డివిజన్ల నుంచి సుమారు 100మంది యువకులు బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్‌యాదవ్ సమక్షంలో బుధవారం బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆ యన కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ ప్రదాని మోదీ సంస్కరణలకు, ఆదర్శాలకు, ఆశయాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. మోదీ పాలనకు ఆకర్షితులై నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో పార్టీలో చేరుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో కొత్త పెన్షన్లు, కొత్తరేషన్‌కార్డులు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇంత వరకు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు.