కరోనాతో పోరాడి విజయం సాధించిన వందేళ్ల బామ్మ

ABN , First Publish Date - 2020-09-17T06:55:33+05:30 IST

అస్సోమ్‌కు చెందిన వందేళ్ల బామ్మ కరోనాను జయించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గువహతిలోని హతిగావోన్

కరోనాతో పోరాడి విజయం సాధించిన వందేళ్ల బామ్మ

గువహతి: అస్సోమ్‌కు చెందిన వందేళ్ల బామ్మ కరోనాను జయించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గువహతిలోని హతిగావోన్ ప్రాంతంలో ఉన్న వృద్దాశ్రమంలో మై హాందిక్(100) అనే బామ్మ జీవిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడింది. వయసు పైబడటంతో బామ్మ బతకడం కష్టమేనని అందరూ అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బామ్మ కరోనాతో పోరాడి విజయం సాధించింది. కరోనా నెగిటివ్ రావడంతో వైద్యులు బామ్మను తిరిగి వృద్దాశ్రమానికి పంపించేశారు. ఇక వందేళ్ల బామ్మ కరోనా నుంచి కోలుకోవడంపై అస్సోమ్ ఆరోగ్యశాఖ మంత్రి హిమంతా బిస్వా ఆనందం వ్యక్తం చేశారు. బామ్మకు చికిత్స అందించిన మోహన్ చౌదరి హాస్పిటల్‌కు చెందిన వైద్యులపై ప్రశంసలు కురిపించారు. కాగా.. అస్సోమ్‌లో ఇప్పటివరకు మొత్తం 1,48,968 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 511 మంది మృత్యువాతపడ్డారు. మరోపక్క కరోనా నుంచి ఇప్పటివరకు 1,16,900 మంది పూర్తిగా కోలుకున్నారు. అస్సోమ్‌లో ప్రస్తుతం 31,555 యాక్టివ్ కేసులున్నాయి.

Updated Date - 2020-09-17T06:55:33+05:30 IST