పులివెందుల నియోజకవర్గానికి 100 వ్యాక్సిన వైల్స్‌

ABN , First Publish Date - 2021-01-16T05:04:31+05:30 IST

పులివెందుల నియో జకవర్గానికి వంద వ్యాక్సిన్‌ వైల్స్‌ వచ్చినట్లు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మధుసూదనరెడ్డి ప్రకటిం చారు.

పులివెందుల నియోజకవర్గానికి 100 వ్యాక్సిన వైల్స్‌
పులివెందులలో వైల్స్‌ను భద్రపరుస్తున్న సూపరింటెండెంట్‌ మధుసూదనరెడ్డి

నేడు వ్యాక్సినేషన ప్రారంభించనున్న ఎంపీ

పులివెందుల రూరల్‌, జనవరి 15: పులివెందుల నియో జకవర్గానికి వంద వ్యాక్సిన్‌ వైల్స్‌ వచ్చినట్లు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మధుసూదనరెడ్డి ప్రకటిం చారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఎంపీ అవినాష్‌రెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నట్లు ఆ యన తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 20 సెంటర్లలో వ్యాక్సి నేషన ప్రక్రియ జరగనుండగా అందులో పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల ఏరియా ఆస్పత్రి, వేం పల్లె మండలం తాళ్లపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయన్నారు. ఒక్కో ఆస్పత్రికి 50 వైల్స్‌ వచ్చాయ న్నారు. కాగా ఒక్కో వైల్‌ ద్వారా పది మందికి టీకా వేయవచ్చని ఇలా రోజూ 100 మంది చొప్పున ఐదు రో జులు వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినను అందించను న్నామన్నారు.

వ్యాక్సిన వేసిన అనంతరం 30నిమిషాలు ఏఎనఎం అబ్జర్వేషనలో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుందన్నారు. ఐదు రోజుల ప్రక్రి య అనంతరం మున్సిపల్‌, పోలీసు, రెవెన్యూ, మలివి డతలో ప్రజలకు వ్యాక్సిన అందించనున్నట్లు సూపరిం టెండెంట్‌ తెలిపారు.  

పోరుమామిళ్ల చేరిన వ్యాక్సిన

పోరుమామిళ్ల, జనవరి 15:  కొవిడ్‌ సంబంధించి దాదా పు 500 మందికి సరిపడా వాక్సిన  గురువారం పోరుమామిళ్ల ఆరోగ్య కేంద్రానికి చేర్చారు. శనివారం ఎమ్మె ల్సీ డీసీ గోవిందరెడ్డి వ్యాక్సినేషన ప్రారంభించనున్నారు. 

మైదుకూరులో....

మైదుకూరు, జనవరి 15: స్థానిక సీహెచ్‌సీలో వ్యాక్సినే షన్‌ కేంద్రాన్ని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించనున్నారు. ఈమేరకు ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ ఖదీర్‌ అహ్మద్‌ వ్యాక్సినేషన్‌పై సిబ్బందికి అవగా హన కల్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దాదాపు 500 మందికి సరిపడా వ్యాక్సిన్‌ వచ్చిందని, మొదటి విడత వేస్తున్నామన్నారు.

Updated Date - 2021-01-16T05:04:31+05:30 IST