మామిడి చెట్లు దగ్ధం

ABN , First Publish Date - 2021-02-28T05:29:48+05:30 IST

మండలంలోని తెగదొడ్డి గ్రామానికి చెందిన రైతు ధర్మరాజుకు చెందిన 100 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి.

మామిడి చెట్లు దగ్ధం

క్రిష్ణగిరి, ఫిబ్రవరి 27: మండలంలోని తెగదొడ్డి గ్రామానికి చెందిన రైతు ధర్మరాజుకు చెందిన 100 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఎకరాలలో ఉన్న మామిడి తోటకు నిప్పంటించారు. రైతు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. 15 సంవత్సరాలుగా చెట్లను పెంచుకుంటూ వచ్చానని పంట చేతికి వచ్చే సమయంలో చెట్లు కాలి బూడిదయ్యాయని రైతు భోరున విలపించాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.

Updated Date - 2021-02-28T05:29:48+05:30 IST