Tik Tok కారణంగా 10ఏళ్ల చిన్నారి మృతి!

ABN , First Publish Date - 2022-05-18T21:48:04+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో టిక్‌టాక్ కారణంగా ఓ తల్లి తన 10ఏళ్ల కూతురును కోల్పోయిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఈ ఘటనకు సంబంధించిన కేసుపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. కాగా.

Tik Tok కారణంగా 10ఏళ్ల చిన్నారి మృతి!

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో టిక్‌టాక్ కారణంగా ఓ తల్లి తన 10ఏళ్ల కూతురును కోల్పోయిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఈ ఘటనకు సంబంధించిన కేసుపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన తవైనా అండర్సన్(Tawainna Anderson) తన పదేళ్ల కూతురు నైలాహ్‌తో కలసి జీవిస్తోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాను ఫాలో అవడం మొదలు పెట్టిన ఆ చిన్నారి.. Tik Tokలోని వీడియోలను తరచూ చూసేది. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌లో ‘బ్లాక్‌ఔట్ ఛాలెంజ్’‌కు సంబంధించిన వీడియోను చూసి.. దాన్ని స్వీకరించింది. ఛాలెంజ్‌లో భాగంగా తన చేయి కోసుకుంది. కాగా.. కూతురు పరిస్థితిని చూసి భయాందోళనలకు గురైన అండర్సన్.. నైలాహ్‌‌ను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్చింది. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఏడాది డిసెంబర్‌లో ప్రాణాలు విడిచింది. దీంతో కూతురు మరణాన్ని చూసి తట్టుకోలేకపోయిన అండర్సన్.. తాజాగా Tik Tokపై పెన్సిల్వేనియా డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసుపై డిస్ట్రిక్ట్ కోర్టు విచారణ జరుపుతోంది. 


Updated Date - 2022-05-18T21:48:04+05:30 IST