10 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , First Publish Date - 2020-09-19T09:54:48+05:30 IST

ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నాగా ర్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 10 క్రస్ట్‌గేట్ల ద్వారా అధి కారులు నీటిని విడుదల చేస్తున్నారు.శుక్రవారం నాటి

10 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

 విజయపురిసౌత్‌, సెప్టెంబరు 18: ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నాగా ర్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 10 క్రస్ట్‌గేట్ల ద్వారా అధి కారులు నీటిని విడుదల చేస్తున్నారు.శుక్రవారం నాటికి నాగార్జున సాగర్‌ నీటిమట్టం 589.60 అడుగులుఉంది. ఇది 310.84 టీఎంసీలకు సమానం.


కుడికాలువ ద్వారా 8,680 క్యూసెక్కులు, 10 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,35,588, లోలెవల్‌ కెనాల్‌ ద్వారా 300, ఎస్‌ఎల్‌బీసీ 1,800, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 25,334, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 1,71,702 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు 1,71,702 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.10 అడుగులుంది. ఇది 210.51 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి 1,61,121 క్యూసెక్కులు, రోజాల నుంచి 62,565 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1,125, మొత్తంగా 2,24,811 కూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 


 పులిచింతలకు 1,60,000 క్యూసెక్కులు

రెంటచింతల, సెప్టెంబరు 18: నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు 17 క్రస్ట్‌ గేట్ల నుంచి 1,60,000 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీరామిరెడ్డి చెప్పారు. 13 గేట్లను 1.67 మీటర్లు, 4 గేట్లను 1.25 మీటర్ల మేర ఎత్తినట్లు తెలిపారు.


సాగర్‌ డ్యాం, యూనిట్ల ద్వారా లక్షా 70,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 247.77 అడుగులు కాగా ప్రస్తుతం 245.47 మీటర్ల మేర నీరుందన్నారు. ఈ నీరు 6.6 టీఎంసీలకు సమానమన్నారు.   

Updated Date - 2020-09-19T09:54:48+05:30 IST